విషయానికి నేరుగా వెళ్ళండి
బీటా

దారం ఇంకా పూర్తిగా తెలుగులోకి అనువదించబడలేదు. ఇంకా అనువదించనివి ఇంగ్లీషులో కనిపిస్తాయి.

కీర్తనలు 82

ఈ అధ్యాయం దీనికి చెందినది: Boek III

1దివ్య సమాజంలో దేవుడు నిలబడి ఉన్నాడు. దేవుళ్ళగా చెప్పుకొనేవారు వారి మధ్య ఆయన తీర్పు తీర్చేవాడు. 2ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీరుస్తారు? ఎంతకాలం మీరు దుర్మార్గుల పట్ల పక్షపాతం చూపుతారు? సెలా. 3పేదలకు, అనాథలకు న్యాయం చేయండి, అణగారినవాళ్ళ, అనాథల హక్కులను పరిరక్షించండి. 4పేదలనూ దరిద్రులనూ విడిపించండి. దుర్మార్గుల చేతిలోనుంచి వాళ్ళను తప్పించండి. 5వాళ్లకు తెలివి లేదు, అర్థం చేసుకోలేరు. వాళ్ళు చీకట్లో తిరుగుతుంటారు. భూమి పునాదులన్నీ చితికి పోతున్నాయి. 6మీరు దేవుళ్ళు, మీరంతా సర్వోన్నతుని కుమారులు, అని నేను అన్నాను. 7అయినా ఇతరుల్లాగే మీరూ చనిపోతారు అధికారుల్లోని ఒకరిలాగా కూలిపోతారు. 8దేవా, లేచి భూమికి తీర్పు తీర్చు. నువ్వు రాజ్యాలన్నిటినీ వారసత్వంగా పొందుతావు.

వచన సంఖ్యలు ఎంచుకున్న అనువాదాన్ని అనుసరిస్తాయి, కొన్ని అధ్యాయాల్లో ఒక వచనం తేడా ఉండవచ్చు.

చదివే సౌలభ్యం

మీకు సహాయపడేదాన్ని ఎంచుకోండి. మీ ఎంపిక ఈ పరికరంలోనే ఉంటుంది.

అక్షరాల పరిమాణం

మీ పరికరం సొంత సెట్టింగ్‌లు (జూమ్, స్క్రీన్ రీడర్, డార్క్ మోడ్) ఇష్టమా? అవి ఇక్కడ కూడా పనిచేస్తాయి.