విషయానికి నేరుగా వెళ్ళండి
బీటా

దారం ఇంకా పూర్తిగా తెలుగులోకి అనువదించబడలేదు. ఇంకా అనువదించనివి ఇంగ్లీషులో కనిపిస్తాయి.

కీర్తనలు 118

ఈ అధ్యాయం దీనికి చెందినది: Boek V

1యెహోవా దయాళుడు. ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలిచి ఉంటుంది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. 2ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని ఇశ్రాయేలీయులు అందురు గాక. 3ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని అహరోను వంశస్థులు అందురు గాక. 4ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని యెహోవాపై భయభక్తులు గలవారు అందురు గాక. 5ఇరుకైనచోట ఉండి నేను యెహోవాకు మొర్రపెట్టాను. విశాలస్థలంలో యెహోవా నాకు జవాబిచ్చాడు. 6యెహోవా నా పక్షంగా ఉన్నాడు నేను భయపడను. మనుషులు నాకేమి చేయగలరు? 7యెహోవా నా పక్షం వహించి నాకు సహకారిగా ఉన్నాడు. నా శత్రువుల విషయంలో నా కోరిక నెరవేరడం నేను చూస్తాను. 8మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. 9రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. 10అన్యజనులందరూ నన్ను చుట్టుకుని ఉన్నారు. యెహోవా నామాన్నిబట్టి నేను వారిని నిర్మూలం చేస్తాను. 11నలుదెసలా వారు నన్ను చుట్టుముట్టి ఉన్నారు. యెహోవా నామాన్నిబట్టి నేను వారిని నిర్మూలం చేస్తాను. 12కందిరీగల్లాగా వారు నా మీద ముసురుకున్నారు. ముళ్ళ పొదల మంట ఆరిపోయినట్టు వారు నశించిపోయారు. యెహోవా నామాన్ని బట్టి నేను వారిని నిర్మూలం చేస్తాను. 13వారు నాపై దాడి చేసి పడదోశారు. కానీ యెహోవా నాకు సహాయం చేశాడు. 14యెహోవా నా బలం, నా గానం. ఆయనే నా రక్షణాధారం. 15నీతిమంతుల గుడారాల్లో జయజయధ్వానాలు వినిపిస్తాయి. యెహోవా కుడి చెయ్యి విజయం సాధిస్తుంది. 16యెహోవా కుడి చెయ్యి మహోన్నతం అయింది. యెహోవా దక్షిణహస్తం విజయం సాధిస్తుంది. 17నేను చావను. బ్రతికి ఉంటాను. యెహోవా క్రియలు వర్ణిస్తాను. 18యెహోవా నన్ను కఠినంగా శిక్షించాడు గానీ ఆయన నన్ను మరణానికి అప్పగించలేదు. 19నేను ప్రవేశించేలా నీతి ద్వారాలు తెరవండి, ఎక్కడ దేవుని ప్రజలు ప్రవేశిస్తారో. నేను ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తాను. 20ఇది యెహోవా ద్వారం. నీతిమంతులు దీనిలో ప్రవేశిస్తారు. 21నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎందుకంటే నేను పిలిస్తే పలికావు. నాకు రక్షణాధారం అయ్యావు. 22ఇల్లు కట్టేవారు తిరస్కరించిన రాయి మూలరాయి అయింది. 23ఇది యెహోవా మూలంగా జరిగింది. ఇది మన దృష్టికి అబ్బురం. 24ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీనిలో మనం ఉప్పొంగిపోతూ ఆనందించుదాము. 25యెహోవా, దయచేసి నన్ను రక్షించు. యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించు. 26యెహోవా పేరట వచ్చేవాడికి ఆశీర్వాదం కలుగు గాక. యెహోవా మందిరంలోనుండి మిమ్మల్ని దీవిస్తున్నాము. 27యెహోవాయే దేవుడు. ఆయన మనకు వెలుగు అనుగ్రహించాడు. ఉత్సవ బలిపశువును తాళ్లతో బలిపీఠం కొమ్ములకు కట్టండి. 28నువ్వు నా దేవుడివి. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నువ్వు నా దేవుడివి. నిన్ను ఘనపరుస్తాను. 29యెహోవా దయాళుడు. ఆహా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నిబంధన విశ్వాస్యత శాశ్వతకాలం నిలిచి ఉంది.

వచన సంఖ్యలు ఎంచుకున్న అనువాదాన్ని అనుసరిస్తాయి, కొన్ని అధ్యాయాల్లో ఒక వచనం తేడా ఉండవచ్చు.

చదివే సౌలభ్యం

మీకు సహాయపడేదాన్ని ఎంచుకోండి. మీ ఎంపిక ఈ పరికరంలోనే ఉంటుంది.

అక్షరాల పరిమాణం

మీ పరికరం సొంత సెట్టింగ్‌లు (జూమ్, స్క్రీన్ రీడర్, డార్క్ మోడ్) ఇష్టమా? అవి ఇక్కడ కూడా పనిచేస్తాయి.