విషయానికి నేరుగా వెళ్ళండి
బీటా

దారం ఇంకా పూర్తిగా తెలుగులోకి అనువదించబడలేదు. ఇంకా అనువదించనివి ఇంగ్లీషులో కనిపిస్తాయి.

కీర్తనలు 26

ఈ అధ్యాయం దీనికి చెందినది: Boek I

1యెహోవా, నేను నిజాయితీగా నడుచుకున్నాను. నాకు న్యాయం తీర్చు. ఊగిసలాడకుండా యెహోవాలో నా నమ్మకం ఉంచాను. 2యెహోవా, నన్ను పరిశీలించు. నన్ను పరీక్షించు. నా అంతరంగంలో, నా హృదయంలో ఉన్న స్వచ్ఛతను పరీక్షించు. 3నీ నిబంధన నమ్మకత్వం నా కళ్ళెదుట ఉంది. నీ సత్యంలో నేను నడుచుకుంటున్నాను. 4మోసగాళ్లతో నేను సాంగత్యం చెయ్యను. నిజాయితీ లేని వాళ్ళతో నేను కలిసి ఉండను. 5దుష్టుల గుంపు నాకు అసహ్యం, దుర్మార్గులతో నేను సహవాసం చెయ్యను. 6నేను నిర్దోషిగా నా చేతులు కడుక్కుంటాను. యెహోవా, నేను నీ బలిపీఠం వైపు తిరుగుతాను. 7అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నీ ఆశ్చర్యకార్యాలు వివరిస్తాను. 8నీ మహిమ నిలిచే స్థలం, యెహోవా, నువ్వు నివాసం ఉంటున్న నీ ఇల్లు నాకెంతో ఇష్టం. 9పాపులతో పాటు నా ప్రాణం, క్రూరులతో పాటు నా జీవం ఊడ్చి వేయకు. 10వాళ్ళ చేతుల్లో ఒక కుట్ర ఉంది. వాళ్ళ కుడిచెయ్యి లంచాలతో నిండి ఉంది. 11కాని నా వరకైతే నేను నిజాయితీగా నడుచుకుంటాను. నన్ను విమోచించి నన్ను కరుణించు. 12చదునైన చోట నా పాదం నిలిపాను. సభలలో నేను యెహోవాను స్తుతిస్తాను.

వచన సంఖ్యలు ఎంచుకున్న అనువాదాన్ని అనుసరిస్తాయి, కొన్ని అధ్యాయాల్లో ఒక వచనం తేడా ఉండవచ్చు.

చదివే సౌలభ్యం

మీకు సహాయపడేదాన్ని ఎంచుకోండి. మీ ఎంపిక ఈ పరికరంలోనే ఉంటుంది.

అక్షరాల పరిమాణం

మీ పరికరం సొంత సెట్టింగ్‌లు (జూమ్, స్క్రీన్ రీడర్, డార్క్ మోడ్) ఇష్టమా? అవి ఇక్కడ కూడా పనిచేస్తాయి.