విషయానికి నేరుగా వెళ్ళండి
బీటా

దారం ఇంకా పూర్తిగా తెలుగులోకి అనువదించబడలేదు. ఇంకా అనువదించనివి ఇంగ్లీషులో కనిపిస్తాయి.

కీర్తనలు 14

ఈ అధ్యాయం దీనికి చెందినది: Boek I

1దేవుడు లేడు, అని బుద్ధిలేని వాడు తన మనసులో అనుకుంటాడు. వాళ్ళు చెడిపోయిన వాళ్ళు, అసహ్యమైన పాపం చేసిన వాళ్ళు. మంచి చేసేవాడు ఎవడూ లేడు. 2వివేకం కలిగి దేవుణ్ణి వెదికే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని యెహోవా ఆకాశం నుంచి మనుషులను చూస్తున్నాడు. 3ప్రతిఒక్కడూ దారి తొలగిపోయాడు. వారంతా రోతగా ఉన్నారు. మంచి చేసేవాడు ఒక్కడూ లేడు, ఒక్కడైనా లేడు. 4యెహోవాకు ప్రార్థన చెయ్యకుండా ఆహారం మింగినట్టు నా ప్రజలను మింగుతూ పాపం చేసేవాళ్ళందరికీ తెలివి లేదా? 5వాళ్ళు భయంతో వణికిపోతారు. ఎందుకంటే దేవుడు న్యాయవంతుల సభతో ఉన్నాడు. 6యెహోవా అతనికి ఆశ్రయంగా ఉన్నా, ఆ పేదవాణ్ణి నువ్వు అవమానించాలని చూస్తున్నావు. 7సీయోనులోనుంచి ఇశ్రాయేలుకు రక్షణ కలుగు గాక! యెహోవా చెరలో ఉన్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబులో ఆనందం, ఇశ్రాయేలులో సంతోషం కలుగుతుంది.

వచన సంఖ్యలు ఎంచుకున్న అనువాదాన్ని అనుసరిస్తాయి, కొన్ని అధ్యాయాల్లో ఒక వచనం తేడా ఉండవచ్చు.

చదివే సౌలభ్యం

మీకు సహాయపడేదాన్ని ఎంచుకోండి. మీ ఎంపిక ఈ పరికరంలోనే ఉంటుంది.

అక్షరాల పరిమాణం

మీ పరికరం సొంత సెట్టింగ్‌లు (జూమ్, స్క్రీన్ రీడర్, డార్క్ మోడ్) ఇష్టమా? అవి ఇక్కడ కూడా పనిచేస్తాయి.