విషయానికి నేరుగా వెళ్ళండి
బీటా

దారం ఇంకా పూర్తిగా తెలుగులోకి అనువదించబడలేదు. ఇంకా అనువదించనివి ఇంగ్లీషులో కనిపిస్తాయి.

కీర్తనలు 60

ఈ అధ్యాయం దీనికి చెందినది: Boek II

1దేవా, మమ్మల్ని విడిచిపెట్టావు. మమ్మల్ని విరగగొట్టావు. మాపై కోపం పెంచుకున్నావు. మమ్మల్ని మళ్ళీ బాగు చెయ్యి. 2నీవు దేశాన్ని వణికించావు. దాన్ని ముక్కలుగా చేశావు. అది వణికిపోతున్నది. దానికి తగిలిన గాయాలు బాగు చెయ్యి. 3నీ ప్రజలకు నీ కఠినమైన కార్యాలు కనపరిచావు. మేము తూలిపోయేలా చేసే మద్యాన్ని మాకు తాగించావు. 4సత్యం నిమిత్తం ఎత్తి పట్టుకోవడానికి నీలో భయభక్తులు గలవారికి నీవొక ధ్వజాన్ని ఇచ్చావు. 5నువ్వు ప్రేమించే వారికి విమోచన కలిగేలా నీ కుడిచేతితో నన్ను రక్షించి నాకు జవాబు చెప్పు. 6తన పరిశుద్ధత తోడని దేవుడు ప్రమాణం చేశాడు. నేను ఆనందిస్తాను! షెకెమును పంచిపెడతాను, సుక్కోతు లోయను కొలిపించి ఇస్తాను. 7గిలాదు నాది, మనష్షే నాది. ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం, యూదా నా రాజదండం. 8మోయాబు నేను కాళ్లు కడుక్కునే పళ్ళెం. ఎదోము మీద నా చెప్పు విసిరేస్తాను. ఫిలిష్తియను బట్టి నేను సింహనాదం చేస్తాను. 9కోటగల బలమైన పట్టణంలోకి నన్ను ఎవడు తోడుకుని వెళ్తాడు? ఎదోములోకి నన్ను ఎవడు నడిపిస్తాడు? అన్నాడు. 10దేవా, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టావు కదా? మా సేనలతో కలిసి బయలుదేరడం నువ్వు మానేశావు కదా? 11మనుషుల సహాయం ప్రయోజనం లేనిది. శత్రువులను జయించడానికి మాకు సహాయం చెయ్యి. 12దేవుని సహాయంతో మేము విజయం సాధిస్తాము. మా శత్రువులను అణగదొక్కేవాడు ఆయనే.

వచన సంఖ్యలు ఎంచుకున్న అనువాదాన్ని అనుసరిస్తాయి, కొన్ని అధ్యాయాల్లో ఒక వచనం తేడా ఉండవచ్చు.

చదివే సౌలభ్యం

మీకు సహాయపడేదాన్ని ఎంచుకోండి. మీ ఎంపిక ఈ పరికరంలోనే ఉంటుంది.

అక్షరాల పరిమాణం

మీ పరికరం సొంత సెట్టింగ్‌లు (జూమ్, స్క్రీన్ రీడర్, డార్క్ మోడ్) ఇష్టమా? అవి ఇక్కడ కూడా పనిచేస్తాయి.