విషయానికి నేరుగా వెళ్ళండి
బీటా

దారం ఇంకా పూర్తిగా తెలుగులోకి అనువదించబడలేదు. ఇంకా అనువదించనివి ఇంగ్లీషులో కనిపిస్తాయి.

కీర్తనలు 129

ఈ అధ్యాయం దీనికి చెందినది: Boek V

1ఇశ్రాయేలు ఇలా చెప్పాలి. నా యవ్వన ప్రాయం నుంచి శత్రువులు నాపై దాడి చేశారు. 2నా బాల్యం నుండి నాపై యుద్ధం చేస్తూ వచ్చారు. అయినా వాళ్ళు నన్ను ఓడించలేకపోయారు. 3భూమిని దున్నినట్టు వాళ్ళు నా వీపును దున్నారు. నాకు నాగటి చాళ్ళవంటి గాయాలు చేశారు. 4యెహోవా న్యాయవంతుడు. దుర్మార్గుల తాళ్ళను ఆయన తెంపివేశాడు. 5సీయోనును ద్వేషించే వాళ్ళంతా సిగ్గుపడి, వెనుకడుగు వేస్తారు గాక. 6వాళ్ళు ఇంటికప్పుపై మొలకెత్తే గడ్డిమొక్కలవలె ఉంటారు గాక. అవి ఎదిగీ ఎదగక ముందే వాడిపోతాయి. 7కోసేవాడి గుప్పిలిలోకైనా ఆ గడ్డి చాలదు. పనలు కట్టేవాడు దానితో తన ఒడిని నింపుకోడానికి అది చాలదు. 8ఆ దారిన పోయే వాళ్ళు, యెహోవా దీవెన మీపై ఉండు గాక, యెహోవా నామంలో మిమ్మల్ని దీవిస్తున్నాము అనరు గాక.

వచన సంఖ్యలు ఎంచుకున్న అనువాదాన్ని అనుసరిస్తాయి, కొన్ని అధ్యాయాల్లో ఒక వచనం తేడా ఉండవచ్చు.

చదివే సౌలభ్యం

మీకు సహాయపడేదాన్ని ఎంచుకోండి. మీ ఎంపిక ఈ పరికరంలోనే ఉంటుంది.

అక్షరాల పరిమాణం

మీ పరికరం సొంత సెట్టింగ్‌లు (జూమ్, స్క్రీన్ రీడర్, డార్క్ మోడ్) ఇష్టమా? అవి ఇక్కడ కూడా పనిచేస్తాయి.