విషయానికి నేరుగా వెళ్ళండి
బీటా

దారం ఇంకా పూర్తిగా తెలుగులోకి అనువదించబడలేదు. ఇంకా అనువదించనివి ఇంగ్లీషులో కనిపిస్తాయి.

కీర్తనలు 110

ఈ అధ్యాయం దీనికి చెందినది: Boek V

1యెహోవా నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. నేను నీ శత్రువులను నీ పాదాలకు పీఠంగా చేసే వరకూ నా కుడి వైపున కూర్చో. 2యెహోవా అంటున్నాడు, సీయోనులోనుండి నీ పరిపాలన దండాన్ని చాపు. నీ శత్రువులపై పరిపాలన చెయ్యి. 3నీవు నీ వైభవాన్ని ప్రదర్శించేటప్పుడు నీ ప్రజలు ఇష్టపూర్వకంగా నీతో వస్తారు. అరుణోదయ గర్భంలో నుండి కురిసే మంచులాగా నీ యవ్వనం ఉంటుంది. 4మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరం యాజకుడవై ఉంటావు, అని యెహోవా ప్రమాణం చేశాడు. ఆయన మాట తప్పనివాడు. 5ప్రభువు నీ కుడిచేతి వైపున ఉండి తన కోపదినాన రాజులను హతమారుస్తాడు. 6అన్యజాతులకు ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన లోయలను శవాలతో నింపుతాడు. అనేక దేశాల నేతలను ఆయన హతమారుస్తాడు. 7దారిలో ఏటి నీళ్లు పానం చేస్తాడు. విజయగర్వంతో తన తల పైకెత్తుతాడు.

వచన సంఖ్యలు ఎంచుకున్న అనువాదాన్ని అనుసరిస్తాయి, కొన్ని అధ్యాయాల్లో ఒక వచనం తేడా ఉండవచ్చు.

చదివే సౌలభ్యం

మీకు సహాయపడేదాన్ని ఎంచుకోండి. మీ ఎంపిక ఈ పరికరంలోనే ఉంటుంది.

అక్షరాల పరిమాణం

మీ పరికరం సొంత సెట్టింగ్‌లు (జూమ్, స్క్రీన్ రీడర్, డార్క్ మోడ్) ఇష్టమా? అవి ఇక్కడ కూడా పనిచేస్తాయి.