విషయానికి నేరుగా వెళ్ళండి
బీటా

దారం ఇంకా పూర్తిగా తెలుగులోకి అనువదించబడలేదు. ఇంకా అనువదించనివి ఇంగ్లీషులో కనిపిస్తాయి.

కీర్తనలు 63

ఈ అధ్యాయం దీనికి చెందినది: Boek II

1దేవా, నా దేవుడివి నీవే. మనసారా నిన్ను వెదుకుతాను. నీళ్లు లేక ఎండిపోయిన ప్రాంతంలో నా ప్రాణం నీకోసం దప్పిగొని ఉంది. నిన్ను చూడాలని నా శరీరం ఆత్రుతతో ఎదురు చూస్తున్నది. 2నీ బలాన్ని, నీ మహిమను చూడాలని పరిశుద్ధ మందిరంలో నీవైపు చూస్తూ కనిపెడుతున్నాను. 3నీ నిబంధన నమ్మకత్వం జీవం కంటే శ్రేష్టం. నా పెదాలు నిన్ను స్తుతిస్తాయి. 4నీ పేరున నా చేతులు పైకెత్తి నా జీవిత కాలమంతా నిన్ను స్తుతిస్తాను. 5కొవ్వు, మూలుగ తిన్నట్టుగా నా ప్రాణం తృప్తిగా ఉంది. ఆనందించే పెదాలతో నా నోరు నిన్ను కీర్తిస్తుంది. 6రాత్రి జాముల్లో నా పడక మీద ఉండి నీ గురించి ధ్యానం చేస్తాను. 7నువ్వు నాకు సహాయం చేశావు. నీ రెక్కల నీడలో నేను సంతోషిస్తాను. 8నా ప్రాణం నీపై ఆనుకుని ఉంది. నీ కుడిచెయ్యి నాకు ఆధారంగా ఉంది. 9నా ప్రాణం తీయాలని వెతుకుతున్నవారు భూమి అడుగు భాగాలకు దిగిపోతారు. 10వారు కత్తి పాలవుతారు. నక్కలకు ఆహారం అవుతారు. 11అయితే రాజునైన నేను దేవునిలో సంతోషిస్తాను. ఆయన నామంలో ప్రమాణం చేసేవారంతా ఆయన విషయం గర్వపడతారు. అబద్ధాలు చెప్పే వారి నోరు మూతబడుతుంది.

వచన సంఖ్యలు ఎంచుకున్న అనువాదాన్ని అనుసరిస్తాయి, కొన్ని అధ్యాయాల్లో ఒక వచనం తేడా ఉండవచ్చు.

Statenvertaling (1637) · World English Bible (2000) · ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (2019): © 2017, 2019 Bridge Connectivity Solutions, bridgeconn.com, via eBible.org. CC BY-SA 4.0; notes and headings omitted. · మూలాలు, లైసెన్సులు

చదివే సౌలభ్యం

మీకు సహాయపడేదాన్ని ఎంచుకోండి. మీ ఎంపిక ఈ పరికరంలోనే ఉంటుంది.

అక్షరాల పరిమాణం

మీ పరికరం సొంత సెట్టింగ్‌లు (జూమ్, స్క్రీన్ రీడర్, డార్క్ మోడ్) ఇష్టమా? అవి ఇక్కడ కూడా పనిచేస్తాయి.