విషయానికి నేరుగా వెళ్ళండి
బీటా

దారం ఇంకా పూర్తిగా తెలుగులోకి అనువదించబడలేదు. ఇంకా అనువదించనివి ఇంగ్లీషులో కనిపిస్తాయి.

కీర్తనలు 121

ఈ అధ్యాయం దీనికి చెందినది: Boek V

1కొండల వైపు నా కన్నులు ఎత్తి చూస్తున్నాను. నాకు సహాయం ఎక్కడనుండి వస్తుంది? 2యెహోవాయే నాకు సహాయం చేస్తాడు. భూమిని, ఆకాశాలను సృష్టించింది ఆయనే. 3ఆయన నీ పాదాలను జారనియ్యడు. నిన్ను కాపాడేవాడు కునికిపాట్లు పడదు. 4ఇశ్రాయేలు ప్రజల సంరక్షకుడు కునికిపాట్లు పడడు, నిద్రపోడు. 5నిన్ను కాపాడేవాడు యెహోవాయే. నీ కుడి పక్కన యెహోవా నీకు తోడూనీడా. 6పగలు సూర్యుడు గానీ రాత్రి చంద్రుడు గానీ నీకు హాని చెయ్యరు. 7ఎలాంటి ప్రమాదం జరగకుండా యెహోవా నిన్ను కాపాడతాడు. నీ ప్రాణాన్ని కాపాడేది ఆయనే. 8ఇకనుండి అన్ని వేళలా నువ్వు చేసే వాటన్నిటిలో యెహోవా నిన్ను కాపాడతాడు.

వచన సంఖ్యలు ఎంచుకున్న అనువాదాన్ని అనుసరిస్తాయి, కొన్ని అధ్యాయాల్లో ఒక వచనం తేడా ఉండవచ్చు.

Statenvertaling (1637) · World English Bible (2000) · ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (2019): © 2017, 2019 Bridge Connectivity Solutions, bridgeconn.com, via eBible.org. CC BY-SA 4.0; notes and headings omitted. · మూలాలు, లైసెన్సులు

చదివే సౌలభ్యం

మీకు సహాయపడేదాన్ని ఎంచుకోండి. మీ ఎంపిక ఈ పరికరంలోనే ఉంటుంది.

అక్షరాల పరిమాణం

మీ పరికరం సొంత సెట్టింగ్‌లు (జూమ్, స్క్రీన్ రీడర్, డార్క్ మోడ్) ఇష్టమా? అవి ఇక్కడ కూడా పనిచేస్తాయి.