విషయానికి నేరుగా వెళ్ళండి
బీటా

దారం ఇంకా పూర్తిగా తెలుగులోకి అనువదించబడలేదు. ఇంకా అనువదించనివి ఇంగ్లీషులో కనిపిస్తాయి.

యెహెజ్కేలు 15

ఈ అధ్యాయం దీనికి చెందినది: Oordeel over Jeruzalem

1యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా చెప్పాడు. 2“నరపుత్రుడా, ద్రాక్షచెట్టు కర్ర అడవిలోని ఇతర చెట్ల కర్రల కంటే ఏ విషయంలో గొప్పది? 3ద్రాక్ష చెట్టు కర్రను ఎవరైనా దేనికైనా ఉపయోగిస్తారా? దేనినైనా తగిలించడానికి దాని కర్రతో కొక్కేలు తయారు చేస్తారా? 4చూడండి! అది పొయ్యిలో పెట్టి కాల్చడానికే ఉపయోగపడుతుంది కదా! ఆ కర్ర రెండు వైపులా, మధ్యలోనూ పూర్తిగా కాలిన తరువాత ఇక దేనికి పనికి వస్తుంది? 5చూడు, అది కాలకముందు దేనికీ ఉపయోగపడలేదు. పూర్తిగా కాలిపోయిన తరువాత కూడా దేనికీ పనికి రాదు! 6కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. అడవిలోని ఇతర చెట్లవలే కాకుండా ద్రాక్ష చెట్టుని అగ్నికి ఇంధనంగా ఉపయోగించాను. ఇదే విధంగా నేను యెరూషలేములో నివసించే వారి విషయంలో చేస్తాను. 7నేను వారికి విరోధంగా ఉంటాను. వాళ్ళు అగ్ని నుండి తప్పించుకున్నా తిరిగి అగ్ని వాళ్ళని కాల్చివేస్తుంది. నేను వాళ్లకి విరోధంగా ఉంటాను. అప్పుడు యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు. 8వాళ్ళు పాపం చేశారు కాబట్టి నేను దేశాన్ని అంతా దిక్కుమాలిన బంజరు భూమిగా మారుస్తాను.” ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన ఇది.

వచన సంఖ్యలు ఎంచుకున్న అనువాదాన్ని అనుసరిస్తాయి, కొన్ని అధ్యాయాల్లో ఒక వచనం తేడా ఉండవచ్చు.

చదివే సౌలభ్యం

మీకు సహాయపడేదాన్ని ఎంచుకోండి. మీ ఎంపిక ఈ పరికరంలోనే ఉంటుంది.

అక్షరాల పరిమాణం

మీ పరికరం సొంత సెట్టింగ్‌లు (జూమ్, స్క్రీన్ రీడర్, డార్క్ మోడ్) ఇష్టమా? అవి ఇక్కడ కూడా పనిచేస్తాయి.